Train Fire Breaks: కాస్‌గంజ్‌ ప్యాసింజర్‌ రైలులో మంటలు.. మూడు బోగీలు అగ్నికి ఆహుతి..!

|

Dec 27, 2021 | 6:53 AM

యూపీలోని ఫరూకాబాద్‌ స్టేషన్‌లో ఆగిఉన్న కాస్‌గంజ్‌ ప్యాసింజర్‌ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే విస్తరించాయి. ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.

Train Fire Breaks: కాస్‌గంజ్‌ ప్యాసింజర్‌ రైలులో మంటలు.. మూడు బోగీలు అగ్నికి ఆహుతి..!
Train Fire Break
Follow us on

Uttar Pradesh Train Fire Breaks: యూపీలోని ఫరూకాబాద్‌ స్టేషన్‌లో ఆగిఉన్న కాస్‌గంజ్‌ ప్యాసింజర్‌ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే విస్తరించాయి. ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ప్యాసింజర్ రైలు కంపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైలు ఇంజన్‌ నుంచి కోచ్‌ వేరు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.

అయితే.. అగ్నికీలలు ఎలా రాజుకున్నాయన్నది అంతు చిక్కడం లేదు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా.. ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఫరూఖాబాద్ జిల్లాలోని కస్గంజ్ నుండి ఆదివారం రాత్రి 11:45 గంటల ప్రాంతంలో హర్సింగ్‌పూర్ గోవా హాల్ట్ నుండి బయలుదేరిన ప్యాసింజర్ రైలు కోచ్‌లో మంటలు చెలరేగాయి. గార్డుకు సమాచారం అందించడంతో హథియాపూర్ రైల్వే క్రాసింగ్ దగ్గర రైలును నిలిపివేశారు.

రైలు వెనుక ఉన్న మూడో కంపార్ట్‌మెంట్‌ను ఇంజిన్‌ నుంచి హడావుడిగా వేరు చేశారు. మంటలను చూసి అందులో కూర్చున్న ప్రయాణికులు కిందకు దూకేశారు. కొంతమంది ప్రయాణికులకు
స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, మంటలను ఆర్పివేస్తున్నట్లు ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ వీరేంద్ర కుమార్ తెలిపారు.

Read Also… Election 2022: ఎన్నికల నిర్వహణపై నేడు కీలక సమావేశం.. ఆరోగ్యశాఖతో భేటీ కానున్న ఈసీ