Uttar Pradesh Man Lost Wife in gambling: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. బల్లియా ప్రాంతంలో జరిగిన ఓ అవమానకరమైన సంఘటన అలస్యంగా బయటకు వచ్చింది. జూదం బెట్టింగ్‌లో ఓ భర్త తన భార్యను కోల్పోయాడు. ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు ఇవ్వనందుకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటేశాడు. జరిగిన దారుణానికి బలైన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ అత్తారింటి ముందే ఆందోళనకు దిగింది. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని బాధితురాలు జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. డీఎం కార్యాలయం నుంచి సమాచారం అందిందని, ఘటనా స్థలానికి బృందాన్ని పంపి విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు.
బల్లియా ప్రాంతంలోని మనియార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోర్కెండ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగ్రా ప్రాంతానికి చెందిన తస్మిన్ షేక్ 1992 సంవత్సరంలో షాహీన్ అఫ్రోజ్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లయినప్పటి నుంచి భార్యను డబ్బుల కోసం వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో భార్యను తీసుకుని ఢిల్లీ వెళ్లాడు. డబ్బు కోసం తన భార్యను జూదం ఆడించాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. డబ్బు కోసం జూదంలో తనను భర్త ఓడిపోయి ఢిల్లీ నుంచి పారిపోయాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఎలాగోలా బాధితురాలు బల్లియాలోని తన తల్లి ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో జూదంలో ఓడిపోయినందుకు డబ్బులు చెల్లించాలని భర్త డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటి వేశాడని ఆమె జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిపై చర్చలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటోంది బాధితురాలు.
Read Also… AP CM YS Jagan: తుఫాన్ కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు.. ఉత్తరాంధ్ర సమీక్షలో సీఎం జగన్ ఆదేశం!