ఓ వ్యక్తి తన భార్యను చంపడానికి అనుసరించిన పద్ధతి చూస్తే ఇలాంటి భర్త కూడా ఉంటారా అనిపిస్తుంది. అతను చేసిన పని తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. అతను పాముతో భార్యను చంపాడు. అది ఎలాగో చూడండి. కేరళ కొల్లాం జిల్లాలోని అంచల్ పట్టణానికి చెందిన ఉత్రా, సూరజ్ భార్యభర్తలు. మే7, 2020లో ఉత్రా పాము కాటుతో చనిపోయింది. అయితే ఆమె చనిపోవటంపై ఉత్రా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్రా మరణానికి సంబంధించి అప్పటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కొల్లం రూరల్) ఎస్ హరిశంకర్ నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది. ఉత్రా రెండుసార్లు పాముకాటుకు గురయిందని తెలిపారని హరిశంకర్ తెలిపారు. ఇది వింతగా, అసహజంగా భావించామని చెప్పారు.
రెండు సార్లు పాము కాటు
ఉత్రాను రెండుసార్లు పాము కరిచింది. మొదట సూరజ్ ఇంట్లో ఒక కట్ల పాము కాటు వేసింది. అప్పుడు ఆమె బతికింది. తర్వాత ఆమెను నాగుపాము కరిచినప్పుడు చనిపోయింది. ఆమె మొదటి అంతస్తులో ఉన్నప్పుడు కట్లపాము ఉత్రాను కరిచింది. కట్లపాము విషపూరిత పాము జాతి, అరుదుగా చెట్లు ఎక్కుతుంది. సాధారణంగా వ్యవసాయ భూములు, వ్యవసాయ ప్రాంతాల్లో కనిపిస్తాయి. కానీ మొదటి అంతస్తులో ఘటన జరిగిదంటే ఎవరైనా పామును అక్కడకు తీసుకెళ్లాలి ఉండాలని పోలీసులు అనుమానించారు. సూరజ్ ఇంటిని తనిఖీ చేస్తున్నప్పుడు, అతని తల్లి మొదటి అంతస్తు కిటికీ వైపు వంగి ఉన్న చెట్టు కొమ్మను చూపించింది. పాము ఆ కొమ్మ ద్వారా కిటికీ గుండా పాము లోపలికి ప్రవేశించిందని ఆమె చెప్పింది.
ఉత్రాను కరిచిన రెండో పాము నాగుపాము. ఈ సంఘటన ఉత్రా ఇంట్లో జరిగింది. పాము అక్కడికి ఎలా చేరుకుంది? గది తలుపు పక్కన రెండు కిటికీలు, మూడు వెంటిలేటర్లు ఉన్నాయి. కిటికీలు 150 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్నాయి. కేసు గురించి పోలీసులు పశువైద్యుల సహాయం తీసుకున్నారు. నాగుపాము తన మొత్తం పొడవులో మూడింట ఒక వంతు మాత్రమే పైకి ఎక్కుతుందని వారు చెప్పారు. ఉత్రాను కరిచిన పాము 150 సెంటీమీటర్లు ఉంది అంటే 50 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఎక్కలేదు. వేటాడిన తరువాత, నాగుపాములు ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకుంటాయి. కోబ్రాస్ రెచ్చగొడితే తప్ప అవి కుట్టవని పోలీసులకు తెలిసింది.
సూరజ్ వన్యప్రాణి ఔత్సాహికుడని తెలిసింది. అతని ఇంట్లో మేకలు, కుందేళ్లు, కుక్కలు మొదలైనవి ఉన్నాయి. ఉత్రా మరణానికి ఆరు నెలల ముందు సూరజ్ ఒక పామును ఇంటికి తీసుకువచ్చి తన కుటుంబం ముందు ప్రదర్శించాడు. సూరజ్‌కి పామును ఇచ్చినట్లు పాముల పట్టే సరేషే వ్యక్తి అంగీకరించాడు. సురేష్, సూరజ్ ఒకరినొకరు ఫోన్‌లో సంప్రదించినప్పటికీ రెండుసార్లు మాత్రమే కలుసుకున్నారు. సూరజ్‌కు పాముల లక్షణాలు బాగా తెలుసు. వైపర్ మొదటి అంతస్తుకు ఎక్కదని సూరజ్‌కు తెలుసు. బాత్‌రూమ్‌లో వైపర్ ఉత్రాను కొరికిందని ఆయన చెప్పారు. కానీ అతని మొబైల్ ఫోన్ తనిఖీ చేస్తే పాముల గురించి పరిశోధన చేశాడు. అతను కట్ల పాము గురించి పరిశోధించాడు. తర్వాత అతను నాగుపాముల గురుంచి తెలుసుకున్నాడు. ఉత్రాను కరిచిన పాముల గురించే అతను ఎందుకు పరిశోధన చేశాడని పోలీసులు అతడిని ప్రశ్నించారు. దీనిపై అతను సరిగా సమాధానం చెప్పాలేదు. అతన్ని పూర్తి స్థాయిలో విచారించగా పామును తానే తీసుకొచ్చి ఉత్రాను కాటు వేసేలా చేశానని ఒప్పుకున్నాడు. మరో అమ్మాయని పెళ్లి చేసుకోవాడానికి ఉత్రా అడ్డుగా ఉందని ఈ పని చేసినట్లు సూరజ్ చెప్పారు. ఈ కేసులు అన్ని ఆధారాలను పరిశీలించిన కోర్టు అతడిని దోషిగా తేల్చింది. దోషిగా తేలిన సూరజ్‌కు అక్టోబర్ 13న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది కోర్టు.
Read Also.. Home Guard Cheating: ఒంగోలు ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తోన్న హోంగార్డు వాణి లీలలు..!