Man shot dead in broad daylight: రిపబ్లిక్ డే (Republic Day) రోజున పట్టపగలు ఓ వ్యక్తిపై తుపాకులతో కాల్పులు జరిపి హత్య చేసిన ఉందంతం ఉత్తరప్రదేశ్ (UP)లో చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గ్రేటర్ నోయిడా (Noida)లోని పల్లా గ్రామానికి చెందిన విపత్ రాం అనే యువకుడు బుధవారం ఏదో పనినిమిత్తం స్కూటీపై వెళ్తున్నాడు. దాద్రీ ప్రాంతంలో హఠాత్తుగా గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో విపత్ రాంకు పలు బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం పోలీసులు స్థానికులను విచారించారు. ఈ విచారణలో విపత్ రాంకు ఎవరితోనూ వివాదాలు లేవని తెలిసినట్లు పోలీసధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
మరోవైపు గణతంత్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించాయి. హత్య జరిగిన సమయంలో కూడా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోతో సహా చుట్టూ కట్టుదిట్టమైన పోలీసుల నిఘా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పట్టపగలు దుండగులు హత్యకు పాల్పడ్డారు. హంతకులను త్వరలో పట్టుకుంటామని పోలీసధికారులు చెబుతున్నప్పటికీ, భద్రతపై స్థానికంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read: