యూపీలోని ఉన్నావ్ జిల్లాలో పశువులను మేపడానికి వెళ్లిన ఇద్దరు బాలికలు అనుమానాస్పదంగా మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉన్నావ్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు పశువులను మేపడానికి వెళ్లి అదృశ్యమయ్యారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబ సభ్యులకు తమ పిల్లలు చనిపోయి కనిపించారు. షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకి చేరుకున్న పోలీసులు చనిపోయిన ఇద్దరి శవాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే దీనిపై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
ఆ ఇద్దరు బాలికల శరీరంపై ఎలాంటి గాయాల గుర్తుల్లేవన్నారు. అలాగే వారి మరణానికి కారణాలు కూడా పోస్టుమార్టం నివేదికలో నిర్ధారణ కాలేదని చెప్పారు. మృతి చెందిన బాలికల అవయవాలను రసాయన పరీక్ష కోసం నిల్వ చేసినట్టు చెప్పారు. విషం వల్లే చనిపోయి ఉంటారని వైద్యులు అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు. కాన్పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మరో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు చెప్పారని డీజీపీ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై డీజీపీ నుంచి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాన్పూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు మంచి వైద్యం అందించాలని సీఎం ఆదేశించినట్టు అధికార ప్రతినిధి తెలిపారు.
Advocates Murder : న్యాయవాదుల హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారో తెలుసా.. అసలు నిజాలు వెలుగులోకి..