App Download money taken:టెక్నాలజీతో పాటు సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. అమాయకులను ఇట్టే పట్టేసుకుంటున్న కొందరు సైబర్ నేరగాళ్లు.. వారి అకౌంట్ల నుంచి డబ్బులను లాగేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ( అమెరికాలో కోటి దాటేసిన కరోనా కేసులు)
వివరాల్లోకి వెళ్తే.. కోరడిలో ఉండే అశోక్ మన్వాటే అనే వ్యక్తి ఫోన్‌కి ఇటీవల ఓ కాల్ వచ్చింది. అందులో తనను కస్టమర్ కేర్‌గా చెప్పుకున్న ఓ వ్యక్తి, ఫోన్‌లో రిమోట్ డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఆ సమయంలో ఆ ఫోన్‌ని ఉపయోగిస్తున్న అశోక్ కుమారుడు.. సైబర్ నేరగాళ్ల సూచలన ప్రకారం యాప్ డౌన్‌లోడ్ చేశాడు. దీంతో ఒక్క నిమిషయంలో బ్యాంక్ ఖాతా నుంచి 9 లక్షలు మాయమయ్యాయి. విషయం తెలుసుకున్న అశోక్ పోలీసులను ఆశ్రయించాడు. ఇక అశోక్ ఫిర్యాదు మేరకు నిందితులపై సెక్షన్ 419, 420 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఇలాంటి కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వెల్లడించారు. ( కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 857 కొత్త కేసులు.. 4 మరణాలు)