Hyderabad News: మద్యం సేవించి వాహనం నడిపే వారికి హెచ్చరిక. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే.. ఇక నుంచి స్పాట్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు చాలా మందిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. ఆర్టీఏ అధికారులు లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. అయినా చాలా మంది పదే పదే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడుతున్నారు. తాజాగా కొండాపూర్‌లో డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఇద్దరు ఆకతాయిలు షాకిచ్చారు. శ్వాస పరీక్ష చేసేందుకు నోటి దగ్గర పెట్టిన బ్రీత్ ఎనలైజర్ యంత్రాన్ని పోలీసుల చేతుల్లోంచి లాక్కొని ఉడాయించారు.
కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్ సమీపాన శుక్రవారం రాత్రి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. రాత్రి 11.45 సమయంలో మియాపూర్ వైపు నుంచి ద్విచక్ర వాహనం మీద వస్తోన్న ఇద్దరిని వారు ఆపారు. బైకు నడుపుతున్న వ్యక్తికి శ్వాస పరీక్షలు నిర్వహించేందుకు హోంగార్డు తన చేతిలో ఉన్న బ్రీత్ ఎనలైజర్‌ను యువకుడి నోటికి దగ్గరలో పెట్టాడు. ఇంతలో సదరు యువకుడు హోంగార్డు చేతిలో ఉన్న యంత్రాన్ని లాక్కొని వేగంగా బైకు మీద దూసుకెళ్లి మాయమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మందుబాబులతో ట్రాఫిక్ పోలీసులకు తిప్పలు తప్పవు. తాగిన మైకంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. సాధారణ పౌరులే కాకుండా సెలబ్రిటీలు సైతం ఇదే విధంగా ప్రవర్తించడం మనం చాలాసార్లు చూశాం. రోడ్డు పై నానా హంగామా క్రియేట్ చేస్తారు. కేసులు నమోదు చేసినా, బండ్లు సీజ్ చేసినా, జైలులో వేసినా మందుబాబుల తీరు మాత్రం మారడంలేదు.
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..