Car Rash Driving Accident: నారాయణఖేడ్‌లో బొలెరో కారు బీభత్సం.. పారిశుద్ధ్య కార్మికురాలితో సహా ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకువచ్చిన బొలెరో వాహనం.. ఇద్దరు మహిళల ప్రాణానలు తీసింది.

Car Rash Driving Accident: నారాయణఖేడ్‌లో బొలెరో కారు బీభత్సం.. పారిశుద్ధ్య కార్మికురాలితో సహా ఇద్దరు మృతి
Accident

Updated on: Jun 07, 2021 | 9:23 AM

Sangareddy Car Accident: సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకువచ్చిన బొలెరో వాహనం.. ఇద్దరు మహిళల ప్రాణానలు తీసింది. పట్టణంలోని రాజీవ్ చౌక్‌లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు బీభత్సానికి విద్యుత్ స్తంభాలు, పాన్ డబ్బాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.

ఒక్కసారిగా స్పీడ్‌గా వచ్చిన కారు ఢీకొనడంతో..తీవ్రగాయాలతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను పారిశుద్ధ్య కార్మికురాలైన సత్తమ్మ, వెంకమ్మగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు కారణకుడైన డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also…. Suicide Attempt: కరోనా సోకిందన్న మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కత్తితో గొంతుకోసుకుని..