Treasure hunt: మాంత్రికుడి మాటలు విని.. గుప్త నిధుల కోసం 50 అడుగుల గొయ్యి… అదే వారి ప్రాణాలు తీసింది

|

Mar 29, 2021 | 5:49 PM

మలయాళ మాంత్రికుడి మాటలు విన్నారు. నిధి కోసం ఇంటి వెనుక 50 అడుగుల గొయ్యి తవ్వారు. చివరికి అదే వారి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన తమిళనాడులోకి తూత్తుకుడిలో జరిగింది.

Treasure hunt: మాంత్రికుడి మాటలు విని.. గుప్త నిధుల కోసం 50 అడుగుల గొయ్యి... అదే వారి ప్రాణాలు తీసింది
Treasurehunt
Follow us on

మలయాళ మాంత్రికుడి మాటలు విన్నారు. నిధి కోసం ఇంటి వెనుక 50 అడుగుల గొయ్యి తవ్వారు. చివరికి అదే వారి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన తమిళనాడులోకి తూత్తుకుడిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముత్తయ్య అనే వ్యక్తి తిరువల్లూరు కాలనీలో కుటుంబంతో కలిసి నివశిస్తున్నాడు. అతడికి ఓ మలయాళ మాంత్రికుడు వారి ఇంటి వెనుక నిధులు, నిక్షేపాలు ఉన్నాయని చెప్పాడు. తవ్వకాలు జరిపితే వాటిని సొంతం చేసుకోవచ్చని సలహా ఇచ్చాడు. దీంతో ముత్తయ్య గత ఆరు నెలలుగా తన పిల్లలతో పాటు ఇతరుల సాయంతో గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. ఇప్పటికే 50 అడుగుల లోతుమేర తవ్వకాలు జరిపారు. అయితే ఇటీవల భారీ వర్షం కురవడంతో ఆ గొయ్యి నీటితో నిండిపోయింది. దీంతో మోటారు సాయంతో అందులోని నీటిని బయటకు తోడారు. ఆ తర్వాత తవ్వకాలు కొనసాగించేందుకు నలుగురు వ్యక్తులు దిగారు. వారిలో సతంకుళానికి చెందిన రఘుపతి (47), నిర్మల్ గణపతి (19) ఇద్దరూ గొయ్యి లోపల విషవాయువు పీల్చడంతో ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందారు. ముత్తయ్య కుమారులు శివమలై, శివవెలన్‌ల పరిస్థితి విషమంగా ఉంది. వారిని పాలయంకోట మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

క్షుద్రపూజల కోసం వినియోగించిన పుర్రెలు, ఇతర వస్తువులను వారి ఇంటి సమీపంలో పోలీసులు గుర్తించారు. నిధుల కోసం నరబలికి కూడా
ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాతంకుళం డీఎస్పీ గాడ్విన్ జగదీష్ దర్యాప్తు ప్రారంభించారు. మలయాళ మాంత్రికుడు కోసం కూడా అన్వేషణ కొనసాగుతుంది. కాగా ఈమధ్య కాలంలో ఈ గుప్తనిధుల తవ్వకాలు ఎక్కువైపోయాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప… ఇటువంటి వ్యక్తులు మాట వినే పరిస్థితి లేదు.

Also Read:  కిరాతకం.. రూ.720 గురించి మనిషిని దారుణంగా చంపారు.. నిందితులు ముగ్గురు విద్యాధికులు

ఏపీలో తాజా కరోనా బులిటెన్ విడుదల.. ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి.. కొత్తగా ఎన్ని కేసులంటే..?