AP Crime News: తాడేపల్లిలో ఓ ఇంట్లో నుంచి దుర్వాసన.. తాళాలు పగులగొట్టి తెరిచి చూడగా..

Tadepalle: ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ ఇంట్లో దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన

AP Crime News: తాడేపల్లిలో ఓ ఇంట్లో నుంచి దుర్వాసన.. తాళాలు పగులగొట్టి తెరిచి చూడగా..
Crime News

Updated on: Jul 29, 2021 | 4:38 PM

Tadepalle News: ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ ఇంట్లో దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన తాడేపల్లిలో కలకలం రేపింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తాళాలు పగులగొట్టారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. రెండు మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు వారం కిందట ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటికి తాళాలు వేసి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాళం వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని.. లేదా ఎవరైనా చంపి హత్యచేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇద్దరు కూడా భార్య భర్తలు అయివుండొచ్చని పేర్కొంటున్నారు. అయితే.. చుట్టుపక్కల తీవ్ర దుర్వాసన రావడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు స్థానికుల నుంచి పలు వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Hyderabad: పై అంతస్తుకు వెళ్తుండగా కూలిన లిఫ్ట్.. ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం..

Chittoor Murder : చిత్తూరు కలెక్టరేట్ అటెండర్ మృతిలో కొత్త ట్విస్ట్.. ప్రియుడి ప్రేమ కోసం భర్త గొంతు నులిమి..

Follow Us