మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రెండు రోజుల పసిబిడ్డను దుండగులు స్క్రూడ్రైవర్ సాయంతో పొడిచి చంపారు. ఈ హృదయ విదారకర ఘటన రాష్ట్ర రాజధాని భూపాల్ లో చోటుచేసుకుంది. అయోధ్యనగర్ ప్రాంతంలోని ఓ దేవాలయం అవరణలో పసి పాప శాలువలో రక్తం ముడుగులో ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, రెండు రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు పదనైన స్క్రూడ్రైవర్ తో రెండు రోజుల పసిబిడ్డను పలుమార్లు పొడిచి హతమార్చినట్లు గుర్తించారు. అనంతరం శాలువాలో చుట్టి ఆ ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలో ఆస్పత్రుల్లో గత వారం రోజుల్లో జరిగిన కాన్పుల వివరాలను సేకరిస్తున్నారు. చిన్నారి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.