Tv Actor Suicide Attempt: హైదరాబాద్‌లో కలకలం.. టీవీ నటి ఆత్మహత్యాయత్నం..!

| Edited By: Venkata Chari

May 31, 2022 | 5:31 AM

Tv Actor Suicide Attempt: అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని మైతిలిని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. తన భర్త వేధిస్తున్నాడని మైథిలి 6 నెలల క్రితం ఫిర్యాదు చేసింది..

Tv Actor Suicide Attempt: హైదరాబాద్‌లో కలకలం.. టీవీ నటి ఆత్మహత్యాయత్నం..!
Tv Actoress Mythili Suicide Attempt
Follow us on

Tv Actor Suicide Attempt: టీవీ నటి మైథిలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పంజాగుట్ట పోలీసుస్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తన భర్త వాహనాన్ని సీజ్‌ చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని పంజాగుట్ట పోలీసులకు మైథిలి ఫోన్‌ చేసింది. 8 బీజర్లు, రెండు స్లీపింగ్‌ ట్యాబెట్స్‌ మింగి మైథిలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని మైతిలిని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

తన భర్త వేధిస్తున్నాడని మైథిలి 6 నెలల క్రితం ఫిర్యాదు చేసింది.  గతంలో మోతే పీఎస్‌లో భర్తపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భర్తపై చర్యలు తీసుకోవాలని తాజాగా పంజాగుట్ట పోలీసులకు ఫోన్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు.  కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి