నల్గొండ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కొంతమంది ఆకతాయిల మద్య ఓ అమ్మాయి కి సంబందించిన వ్యవహారం చిలికి చిలికి గాలివానల మారింది. వివాదంలో టీఆర్‌ఎస్ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. గొడవలు వద్దని వారించబొయిన కిరాణ షాపు యజమాని, టీఆర్‌ఎస్ మండల కమిటీ కార్యవర్గ సభ్యుడు అయిన లతీఫ్‌ను దారుణంగా హతమార్చారు. జిల్లాలోని కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామంలో మంగళవారం రాత్రి సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు పరిశీలించగా…
గ్రామానికి చెందిన లతీఫ్ సోదరుడు జహంగీర్ కుమారుడు తన వాట్సాప్ స్టేట్‌స్ లో ఓ యువతికి బర్త్ డే సందర్భంగా విషెస్ పోస్టింగ్ పెట్టాడు. అయితే ఈ పోస్టింగ్‌ను చూసి జీర్ణించుకోలేని స్థానిక ఎస్సీకాలనీకి చెందిన కొందరు యువకులు జహంగీర్ కుమారుడిపై దాడి చేశారు. తన కిరాణా షాపు ఎదుటే తన సోదరుడి కుమారుడిపై దాడిచేస్తున్న యువకులను లతీఫ్ అడ్డుకోబోయాడు. రాత్రి గొడవలు వద్దు ఉదయం మాట్లాడుకొండి అని వారించగా కొపొద్రిక్తులైన ఆ యువకులు లతీఫ్ పై విచక్షణ రహితంగా దాడీ చేసి కత్తితొ పొడవగా అక్కడికక్కడే లతీఫ్ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.