నటి ప్రైవేట్ ఫొటోలు లీక్ చేసిన క్యాస్టింగ్ డైరెక్టర్..
ముంబైకి చెందిన నటి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈ సమయంలో ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవసీ ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడం కలకలం రేపింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. విచారణలో ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. అసలు ఏం జరిగిందంటే : ముంబైలో మహావీర్ తక్ ఉరఫ్ నకుల్, నటి(ప్రస్తుత బాధితురాలు) బాయ్ ప్రెండ్ ఇద్దరూ క్యాస్టింగ్ డైరెక్టర్స్‌గా పనిచేస్తున్నారు. ఓ సీరియల్ ఒప్పందం […]
ముంబైకి చెందిన నటి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈ సమయంలో ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవసీ ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడం కలకలం రేపింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. విచారణలో ఓ క్యాస్టింగ్ డైరెక్టర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది.
అసలు ఏం జరిగిందంటే :
ముంబైలో మహావీర్ తక్ ఉరఫ్ నకుల్, నటి(ప్రస్తుత బాధితురాలు) బాయ్ ప్రెండ్ ఇద్దరూ క్యాస్టింగ్ డైరెక్టర్స్‌గా పనిచేస్తున్నారు. ఓ సీరియల్ ఒప్పందం కోసం నటి బాయ్‌ప్రెండ్‌కు రూ. 3 లక్షలు చెల్లించాడు మహావీర్. అయితే తన పని జరగకపోవడంతో డబ్బు తిరిగిచ్చేయాలని నకుల్ అడిగాడు. ఇందుకు ఆమె బాయ్ ప్రెండ్ సహకరించకపోవడంతో..అతడి ఫోన్‌ను తస్కరించాడు. అందులో ఉన్న నటి ప్రైవసీ ఫోటోలను…నకిలీ అకౌంట్స్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం మహావీర్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు.