Khammam: ఖమ్మం జిల్లాలో విషాదం.. నీటి బకెట్లో పడి చిన్నారి మృతి.. అనుమానం వ్యక్తంచేస్తున్న తండ్రి

|

Jul 28, 2021 | 10:31 AM

Khammam News: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుల చేసుకుంది.  నాయకన్ గూడెంలో ఓ చిన్నారి ప్రాణాలు నీటి బకెట్లో కలిసిపోయాయి.

Khammam: ఖమ్మం జిల్లాలో విషాదం.. నీటి బకెట్లో పడి చిన్నారి మృతి.. అనుమానం వ్యక్తంచేస్తున్న తండ్రి
Baby Fall In Water Bucket
Follow us on

ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  నాయకన్ గూడెంలో ఓ చిన్నారి ప్రాణాలు నీటి బకెట్లో కలిసిపోయాయి. 18 మాసాల  ప్రతీక బుడిబుడి నడకలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి మృతి చెందింది. చిన్నారి మరణంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి ఆడుకుంటూ నీటి బకెట్ దగ్గరకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో తలకిందులుగా పడిపోవడంతో ఊపిరాడక విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. అయితే తల్లితో వివాదం కారంగా పాల్వంచలో ఉంటున్న చిన్నారి తండ్రి తన బిడ్డమృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఆ మేరకు కుసుమంచి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం నాయకన్ గూడెంకు చెందిన నిహరికకు 2019లో పాల్వంచకు చెందిన పిల్లి కుమార్ తో వివాహమైది. పెళ్లయిన కొన్నాళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడమతో గర్భిణీ గా ఉన్న నిహారిక పుట్టింటికి వచ్చింది.  ఇటీవల ఆమె తన భర్త, అత్తమామలు,  ఇతర కుటుంబ సభ్యులు వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో పుట్టింట్లోనే ఉంటున్న నిహారిక తన 18 నెలల వయసున్న చిన్నారి ప్రీతికను తల్లికి అప్పగించి సూర్యాపేట కు వెళ్లింది.  మధ్యాహ్న సమయంలో మరో ఇద్దరు చిన్నారులతో  ప్రీతిక ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు  బకెట్‌లోని నీటిలో పడి మృతి చెందింది. అమ్మమ్మ గమనించే సరికే చిన్నారి ప్రాణాలు గాలిలో కాలిసిపోయాయి.  చిన్నారి తండ్రి కుమార్ తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఘటన స్ధలని పరిశీలించి మృతిపై అనుమానం ఉందంటూ ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

(వాసు, TV9 తెలుగు, ఖమ్మం)

Also Read..

రోజుకో ట్విస్ట్ తో మా ఎన్నికలు.. రేపు కృష్ణంరాజు అధ్యక్షతన సమావేశం.. ఏకగ్రీవం కోసం మురళీ మోహన్

ఒకేసారి10 లక్షల దోమలు కుడితే ఏమవుతుందో తెలుసా..! నమ్మలేని నిజాలు తెలుసుకోండి..