టీఎంసీలో అంతర్గత పోరు.. సీనియర్ లీడర్ దారుణ హత్య..

| Edited By:

Jun 10, 2020 | 5:26 PM

మొన్నటి వరకు వెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రంలో అధికార టీఎంసీ, బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య నిత్యం ఘర్షణలు చోటుచేసుకునేవి. అంతేకాదు పలు చోట్ల ఏకంగా ప్రాణాలను కూడా తీసుకున్నారు. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల ముందు అధికార టీఎంసీ, బీజేపీల మధ్య పెద్ద ఘర్షణ వాతావరణం ఉండేది. అయితే ఇప్పుడు సీన్ మారింది. అధికారి పార్టీలోనే దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా సొంత పార్టీలోనే అంతర్గత పోరుతో.. కార్యకర్తల మధ్య విభేధాలు తలెత్తడంతో.. హత్యలకు దారితీస్తున్నాయి. బుధావారం నాడు […]

టీఎంసీలో అంతర్గత పోరు.. సీనియర్ లీడర్ దారుణ హత్య..
Gun Fire
Follow us on

మొన్నటి వరకు వెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రంలో అధికార టీఎంసీ, బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య నిత్యం ఘర్షణలు చోటుచేసుకునేవి. అంతేకాదు పలు చోట్ల ఏకంగా ప్రాణాలను కూడా తీసుకున్నారు. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల ముందు అధికార టీఎంసీ, బీజేపీల మధ్య పెద్ద ఘర్షణ వాతావరణం ఉండేది. అయితే ఇప్పుడు సీన్ మారింది. అధికారి పార్టీలోనే దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా సొంత పార్టీలోనే అంతర్గత పోరుతో.. కార్యకర్తల మధ్య విభేధాలు తలెత్తడంతో.. హత్యలకు దారితీస్తున్నాయి.

బుధావారం నాడు ఉదయం టీఎంసీకి చెందిన సీనియర్ నాయకుడు అమిర్ అలీ ఖాన్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. అంతేకాదు ఆయన వెంట ఉన్న మరో ముగ్గురు సహచరులు నాటు బాంబు దాడిలో గాయపడ్డారు. ఈ సంఘటన రాష్ట్రంలోని సౌత్ 24 పరగణలో చోటుచేసుకుంది. బసంతి అనే ప్రాంతంలో మార్నింగ్ వాక్ వెళ్లిన సమయంలో 56 ఏళ్ల అమీర్ అలీ ఖాన్‌ను దుండుగులు కాల్చిచంపారు. ఈ దాడికి పార్టీలోని అంతర్గత పోరే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే.. స్థానిక టీఎంసీకి చెందిన యూత్ వింగ్ లీడర్‌ ఇంటిపై దాడి జరిగిందని.. అక్కడ పలు నాటు బాంబులు కూడా లభ్యమయ్యాయని సమాచారం. దీంతో ఈ ఘటన పార్టీ అంతర్గత కలహాల వల్లే జరిగిందని పోలీసులు క్లారిటీకి వచ్చారు. యూత్ వింగ్‌కు చెందిన లీడర్‌ ఇంటి సమీపంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.