Breaking News : విధులు నిర్వహిస్తోన్న పారిశుధ్య కార్మికులపైకి దూసుకొచ్చిన టిప్పర్, అక్కడికక్కడే దశరథ్ మ‌ృతి

Tipper crashes sanitation workers : హైదరాబాద్ మేడ్చల్ లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని ఎస్ఆర్ వైన్స్ ముందు డివైడర్ ని..

Breaking News : విధులు నిర్వహిస్తోన్న పారిశుధ్య కార్మికులపైకి దూసుకొచ్చిన టిప్పర్, అక్కడికక్కడే దశరథ్ మ‌ృతి

Edited By: Team Veegam

Updated on: Apr 03, 2021 | 11:30 AM

Tipper crashes sanitation workers : హైదరాబాద్ మేడ్చల్ లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని ఎస్ఆర్ వైన్స్ ముందు డివైడర్ ని ఢీకొట్టి అవతలివైపుకు దూసుకొచ్చింది. ఒక్కసారిగా టిప్పర్ దూసుకురావడంతో అక్కడున్నవారికి తప్పించుకునే అవకాశమే లేకుండాపోయింది. ఈ ఘటనలో పారిశుధ్య కార్మికుడు పూడూరుకి చెందిన దశరథ్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే విధులను నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికురాలు లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాల్ని హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read also : Hyderabad : రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలపై సీఎం కేసీఆర్‌ పగడ్భందీ యాక్షన్‌ ప్లాన్‌