కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన బొలేరో వాహనం.. ముగ్గురు యువకులు మృతి

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గరు యువకులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు.

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన బొలేరో వాహనం.. ముగ్గురు యువకులు మృతి
Road Accident

Edited By: Subhash Goud

Updated on: Apr 14, 2021 | 11:19 PM

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గరు యువకులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. ముద్దనూరు మండలంలోని కొత్తపల్లెలో బైక్‌ వెళ్తున్న ముగ్గురు యువకులను బొలేరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులను రవితేజ, చంద్ర శేఖర్‌రెడ్డి, శివశంకర్‌ లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

కాగా, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా జరుగుతూనే ఉన్నాయి. అజాగ్రత్తగా వాహనాలు నడపడం, మద్యం సేవించి, ఓవర్‌టెక్‌, అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లామంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి ప్రమాదాలు ప్రతి రోజు జరిగి ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

ఇవీ చదవండి: భద్రాచలం వృద్ధురాలి హత్య కేసులో కొత్త ట్విస్ట్.. నాలుగు నెలల తర్వాత వెలుగు చూసిన అసలు నిజం..!

Mobile Chat: బాయ్ ఫ్రెండ్ తో కబుర్లు కట్టిపెట్టమన్నందుకు.. సొంత తమ్ముడిని ఏం చేసిందంటే..