Kadapa: చూస్తుండగానే విషాదం.. చెరువులో మునిగి ముగ్గురు యువకుల మృతి..

3 young men drowned in a pond: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. విషాద సంఘటన

Kadapa: చూస్తుండగానే విషాదం.. చెరువులో మునిగి ముగ్గురు యువకుల మృతి..
Drown

Updated on: Jun 01, 2021 | 7:31 PM

3 young men drowned in a pond: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. విషాద సంఘటన జిల్లాలోని పుల్లంపేట మండలం పుల్లారెడ్డిపేటలో మంగళవారం జరిగింది. మృతులు పుల్లారెడ్డిపేట హరిజనవాడకు చెందిన వెంకటాద్రి (21), శివ (21), రుషి (12)గా గుర్తించారు. అయితే వీరు చెరువులో చేపల కోసం వెళ్లినట్లు సమచారం. నీళ్లలో మునిగిపోతున్న వీరిని స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థలు వెల్లడించారు. క్షణాల్లోనే ముగ్గురు యువకులు నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఈ సంఘటన అనంతరం గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో మృతుల బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పుల్లంపేట పోలీసులు వెల్లడించారు.

Also Read:

ఆ తండ్రికి ఎంత కష్టం.. కుమారుడికి రక్తం కోసం సైకిల్‌పై ఏకంగా 400 కి.మీ ప్రయాణం.. ఎక్కడంటే..?

బేఫికర్ ! కోవిద్ రూల్స్ కి ‘పాతర’…కూతురి ప్రీ-వెడ్డింగ్ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే ‘జాతర’…60 మందిపై కేసు నమోదు

Loading...
Unable to load recommendations.
Follow Us