ఇత్తడి విగ్రహాలను పంచలోహ విగ్రహాలుగా నమ్మించి మోసాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరగాళ్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఘటనలో మట్కా నిర్వహిస్తున్న 14 మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా మిడుతూరు మండలానికి చెందిన ముల్లా అక్బర్ బాషా, పాణ్యంకు చెందిన పిక్ అక్బర్, బనగానపల్లికి చెందిన షాలీబాషా ముఠాగా ఏర్పడి పంచలోహ విగ్రహాల పేరుతో మోసాలకు పాల్పడేవారు. ఇత్తడితో తయారు చేసిన ప్రతిమలను పంచలోహ విగ్రహాలుగా నమ్మించి విక్రయించేవారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విగ్రహాలు విక్రయించేందుకు యత్నిస్తుండగా.. పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి నుంచి 12 ఇత్తడి విగ్రహాలతో పాటు రూ.5,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరో ఘటనలో తాడిపత్రి మండలం సజ్జలదిన్నె సమీపంలో మట్కా నిర్వహిస్తున్న 14 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5,76,000 నగదుతో పాటు 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read
Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు తమ ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోలేరు.. బ్రేకప్స్ ఎక్కువగా అవుతాయి..
Vastu Tips: మంచి ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతకు ఈ వాస్తు చిట్కాలను పాటించి చూడండి..
RUSSIA-UKRAINE: కొనసాగుతూనే వున్న యుద్ధభయం.. రష్యా మాటలు వేరు..చేతలు వేరు..ఏదీ దారి?