మానేరు నదిలో రెస్క్యూ సక్సెస్..ముగ్గురూ సేఫ్‌

|

Sep 28, 2020 | 12:20 PM

మానేరు వాగులో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు క్షేమంగా బయటపడ్డారు. చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులు వాగులో చిక్కుకుపోయారు. ఆ ముగ్గురు దాదాపు

మానేరు నదిలో రెస్క్యూ సక్సెస్..ముగ్గురూ సేఫ్‌
Follow us on

మానేరు వాగులో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు క్షేమంగా బయటపడ్డారు. చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులు వాగులో చిక్కుకుపోయారు. ఆ ముగ్గురు దాదాపు పది గంటల పాటూ వాగులో ఉన్నారు. విషయం తెలిసిన అధికారులు అక్కడకు చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో ముగ్గురు మత్స్యకారులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూర్ మానేరు వాగులో చేపల వేటకు వెల్లిన నేదురు రవి, నేదురు శ్రీనివాస్, పచ్చునూర్ గ్రామానికి చెందిన తిరుపతి వాగులో గల్లంతయ్యారు. గ్రామస్తుల సమాచారం మేరకు వాగు వద్దకు చేరుకున్న పోలీసులు,..రెస్క్యూటీం సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ముగ్గురు వ్యక్తులు గల్లంతు అయ్యారని వీణవంక ఎస్సై కిరణ్ రెడ్డి, తహశీల్దార్ కనుకయ్య, ల తో పాటు మండలంలో ని ప్రజాప్రతినిధులు, మంత్రి ఈటలరాజేందర్ కు, జిల్లా అధికారులకు సమస్యను వివరించడంతో జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, రెస్క్యూ టీం సభ్యులు వచ్చి బొట్ల సహాయంతో వారిని బయటకు తీసుకు వచ్చారు. రాత్రివేళ చుట్టూ చీకటి అయినప్పటికీ ఎంతో శ్రమించి వారిని ఒడ్డుకు చేర్చడం తో వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.