AP Crime: టిప్పర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు దుర్మరణం.. కంకర లోడ్‌తో వెళుతుండగా..

Chittoor District: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి..

AP Crime: టిప్పర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు దుర్మరణం.. కంకర లోడ్‌తో వెళుతుండగా..
Electric shock

Updated on: Aug 09, 2021 | 11:26 AM

Chittoor District: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌కు విద్యుత్‌ తీగలు తగిలి.. ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం కనికాపురంలో చోటు చేసుకుంది. సోమవారం.. కంకర లోడ్‌ వెళ్తున్న టిప్పర్‌కు విద్యుత్‌ తీగలు తగిలాయి. లారీ అంతటా విద్యుత్‌ ప్రవహించి.. విద్యుదాఘంతో.. లారీలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

దీంతో కనికాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కళ్లముందటే ముగ్గురు మరణించడంతో స్థానికులు విద్యుత్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా.. మృతులకు సంబంధించి.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Pori Moni: టాప్‌ హీరోయిన్‌ పోరి మోని లీలలు.. సంపన్నుల పిల్లలే టార్గెట్‌.. అమ్మాయిలను పరిచయం చేసి..

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. నేడే తొమ్మిదో విడత పీఎం కిసాన్ సొమ్ము జారీ.. చెక్ చేసుకోండిలా!

Traffic Challans: విసిగిపోయాడు.. చిర్రెత్తుకొచ్చింది.. తగలబెట్టాడు.. వికారాబాద్ జిల్లాలో సంచలన ఘటన