ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు.. పురాతన ఇల్లుకావడమే కారణం అంటున్న పోలీసులు

దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంటి పైకప్పు కూలి ముగ్గురు వ్యక్తులు దుర్మరణంపాలయ్యారు.  స్థానిక విష్ణు గార్డెన్ లో ఓ ఇంటి పై కప్పు అకస్మాత్తుగా కూలడంతో ముగ్గురు మృతిచెందారు.

ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు.. పురాతన ఇల్లుకావడమే కారణం అంటున్న పోలీసులు

Updated on: Dec 19, 2020 | 1:04 PM

దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంటి పైకప్పు కూలి ముగ్గురు వ్యక్తులు దుర్మరణంపాలయ్యారు.  స్థానిక విష్ణు గార్డెన్ లో ఓ ఇంటి పై కప్పు అకస్మాత్తుగా కూలడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రక్షణ బృందాలతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టన్ కు పంపించారు. ఇల్లు పురాతనమైనది కావడంతోనే పైకప్పు కూలి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.