Mahabubnagar: మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం.. దేవరకద్ర సమీపంలోని గుట్టపై మూడు మృతదేహాలు

Mahabubnagar: మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దేవరకద్ర సమీపంలో గుట్టపై మూడు మృతదేహాలు పడి ఉండటం కలకలం రేపుతోంది. వీటిని గుర్తించిన..

Mahabubnagar: మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం.. దేవరకద్ర సమీపంలోని గుట్టపై మూడు మృతదేహాలు

Updated on: May 27, 2021 | 6:31 AM

Mahabubnagar: మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దేవరకద్ర సమీపంలో గుట్టపై మూడు మృతదేహాలు పడి ఉండటం కలకలం రేపుతోంది. వీటిని గుర్తించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పడివున్న మూడు మృతదేహాలను పరిశీలించారు. మృతుల్లో ఓ యువకుడు, ఇద్దరు మహిళలున్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు దేవరకద్రకు చెందిన తల్లి కుమారుడు, కుమార్తెగా గుర్తించారు పోలీసులు. మన్యంకొండ దేవాలయానికి దర్శనం కోసం వెళ్తున్నామని చెప్పినట్టు స్థానికులు చెబుతున్నారు. వారి మృతికి గల కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారా..? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే జిల్లాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

ఇవీ కూడా చదవండి:

Boat Accident: ఘోర ప్రమాదం.. పడవ మునిగి నలుగురు మృతి.. 156 మంది గల్లంతు.. సహాయక చర్యలు ముమ్మరం

Krishna District Crime News: ఆ మాయలేడి చేతికి చిక్కారో..అంతే.. కృష్ణా జిల్లాలో వ‌రుస మోసాలు !