ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. గోండా జిల్లాలో నిన్న రాత్రి నిద్రిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లపై గుర్తు తెలియని వ్యక్తి ఒకడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు..ఈ దాడిలో మైనర్ బాలికలైన ఆ ముగ్గురూ గాయపడ్డారు.. దళిత సామాజికవర్గానికి చెందిన ఈ బాధితుల వయసు వరుసగా 8,12,17 సంవత్సరాలు ఉంటాయి.. ఇద్దరికి కాలిన గాయాలయ్యాయి.. మరొ బాలిక ముఖంపై యాసిడ్ పడటంతో తీవ్రంగా గాయపడింది.. ఈ ముగ్గురుని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గోండా పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు కానీ దర్యాప్తు అయితే కొనసాగుతోంది.. హాథ్రస్‌లో జగిగిన దారుణ ఘటనను మర్చిపోకముందే గోండాలో ఈ సంఘటన జరగడం అత్యంత బాధాకరం.