
Road Accident: విజయనగరం జిల్లా తెర్లాం మండలం టెక్కలివలస జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ చైతన్య స్కూల్ కి చెందిన బస్సు బైక్‌కి ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్దులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఒకే బైక్ మీద నలుగురు చిన్నారులను తీసుకుకుని వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంతో తన ఇద్దరు కుమారులతో పాటు తోడల్లుడి ఇద్దరు పిల్లలను స్కూల్ నుండి తీసుకువెళుతున్నారు మురళి. ఈ ప్రమాదంలో తన ఇద్దరు కొడుకులను కోల్పోయాడు మురళి. మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బైక్‌పై ఐదుగురు ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం వీరిని రాజాం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో జరుగుతున్న జాతరను చూసేందుకు పిల్లలను తీసుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Read Also…. Viral Video: మామిడికాయ కాదు కోడిగుడ్డే.. కాలజ్ఞానంలో బ్రహ్మంగారూ చెప్పని వింత ఇది..!