Andhra Pradesh: సాయి మాలలో ఇంట్లోకి వచ్చారు.. ఆశీస్సులు ఇస్తారనుకుంటే.. సీన్ రివర్స్

|

Jan 20, 2022 | 3:13 PM

ఇప్పుడు సమాజం అంతా మోసంతో నిండిపోయింది. నమ్మించడం..చీటింగ్ చేయడం కేటుగాళ్లకు ప్రజంట్ ఇదే పని. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో రకంగా మాయ చేస్తూనే ఉన్నారు.

Andhra Pradesh: సాయి మాలలో ఇంట్లోకి వచ్చారు.. ఆశీస్సులు ఇస్తారనుకుంటే.. సీన్ రివర్స్
Representative image
Follow us on

ఇప్పుడు సమాజం అంతా మోసంతో నిండిపోయింది. నమ్మించడం..చీటింగ్ చేయడం కేటుగాళ్లకు ప్రజంట్ ఇదే పని. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో రకంగా మాయ చేస్తూనే ఉన్నారు. ఈజీ మనీ కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. దేవుళ్లను కూడా దోపిడికి వాడుకుంటున్నారు చీటర్స్. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇలాంటి ఘటనే జరిగింది. పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కత్తులతో బెదిరించి, ఆమె మెడలోని 40 గ్రాముల బంగారు గొలుసు లాకెళ్లారు. సాయిబాబా మాల ధరించిన వ్యక్తులు ఉరవకొండ సీవీవీనగర్‌లో దేవుడి కోసం చందాలు సేకరిస్తున్నట్లు నటిస్తూ కాలనీలో తిరుగుతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేస్తూ చోరీకి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంట్లో అశ్వర్థమ్మ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన దొంగ స్వాములు.. కత్తితో బెదిరించి మెడలోని 40 గ్రాముల బంగారు గొలుసు లాక్కుని ఉడాయించారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ, స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కాలంలో జిల్లాలో పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల గ్రామాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

Also Read: కోడిపుంజును వెతుక్కుంటూ గడ్డివాము వైపు వెళ్లిన వ్యక్తి.. అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్

శిశువు చనిపోయిందని ప్రకటించిన వైద్యులు.. శ్మశానంలో పూడ్చిపెడుతుండుగా జరిగిన అద్భుతం