Fake Documents: కరోనా సర్టిఫికేట్ నుంచి బోర్డింగ్ పాస్ ల వరకూ మొత్తం నకిలీ.. లండన్ వెళ్ళబోయి చిక్కిపోయారు!

|

Jan 12, 2022 | 8:02 AM

నకిలీ బోర్డింగ్ పాస్‌లతో ప్రయాణించేందుకు ప్రయత్నించిన ఏడుగురు యువకులను ఢిల్లీ(Delhi)విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా(Air India) ఫ్లైట్ AI-333 కోసం మొత్తం ఈ ఏడుగురు యువకులకు ఇమ్మిగ్రేషన్(Immigration) కూడా క్లియర్ కావడం విశేషం.

Fake Documents: కరోనా సర్టిఫికేట్ నుంచి బోర్డింగ్ పాస్ ల వరకూ మొత్తం నకిలీ.. లండన్ వెళ్ళబోయి చిక్కిపోయారు!
Fake Documents
Follow us on

నకిలీ బోర్డింగ్ పాస్‌లతో ప్రయాణించేందుకు ప్రయత్నించిన ఏడుగురు యువకులను ఢిల్లీ(Delhi)విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా(Air India) ఫ్లైట్ AI-333 కోసం మొత్తం ఈ ఏడుగురు యువకులకు ఇమ్మిగ్రేషన్(Immigration) కూడా క్లియర్ కావడం విశేషం. బోర్డింగ్ గేట్ వద్ద చివరి తనిఖీలో వారు పట్టుబడకపోతే, ఫ్లైట్ ఎక్కి లండన్ చేరుకునేవారు. రీవెరిఫికేషన్‌లో ప్రయాణికుల జాబితాలో వారి పేర్లు లేవని తేలడంతో విషయం బయటపడింది. ఈ సంఘటన పూర్తివివరాలు ఇవీ.. నిందితులను అర్మందీప్ సింగ్, అమృతపాల్ సింగ్, జగదీప్ సింగ్, గుర్విందర్ సింగ్, రాహుల్ జంగ్రా, దీపక్, మన్బీర్‌లుగా గుర్తించారు. వీరికి పంకజ్, రంజిత్, కృష్ణ అనే ఏజెంట్లు నకిలీ పత్రాలు ఇచ్చారు. ఏడుగురు వ్యక్తులు తమ బోర్డింగ్ పాస్, నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టు, ఇతర పత్రాల కోసం ఢిల్లీలోని ఏజెంట్లకు రూ.12 లక్షలు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. బ్రిటన్‌లో శాశ్వతంగా స్థిరపడేలా చేస్తామని ఏజెంట్లు వారందరికీ హామీ ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు.

కౌంటర్ వద్దకు వెళ్లి బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత..

బోర్డింగ్ పాస్ కోసం ప్రయాణికులు కౌంటర్ వద్దకు వెళితే పట్టుబడతారని తెలిసి ఏజెంట్లకు నకిలీ బోర్డింగ్ పాస్ లు అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో పోలీసులు సూత్రధారి పంకజ్‌ని కనిపెట్టి అరెస్ట్ చేశారు. పంకజ్ .. అతని సహచరులు రంజిత్ .. కృష్ణ నకిలీ బోర్డింగ్ పాస్‌లను ఏర్పాటు చేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఐజిఐ విమానాశ్రయం) సంజయ్ త్యాగి తెలిపారు.

యూకే ప్రభుత్వం నుంచి ఆశ్రయం పొందాలని..

అరెస్టయిన ప్రయాణీకులు DG షిప్పింగ్, భారతదేశం నుంచి ఆమోదించిన CDC(నిరంతర డిశ్చార్జ్ సర్టిఫికేట్)పై అందరూ UKకి వెళ్తున్నట్లు వెల్లడించారు. ఇమ్మిగ్రేషన్‌పై వారు వ్యాపార వేత్తలుగా చెప్పుకున్నారు. వారు యూకే చేరుకున్న తర్వాత CDCపత్రాలను నాశనం చేసి యూకే ప్రభుత్వం నుంచి ఆశ్రయం పొందడం వారి ప్రణాళికగా పోలీసుల దర్యాప్తులో చెప్పారు.

ఇవి కూడా చదవండి: ఇల్లు అమ్మేసి బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టాడు.. నేడు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగాడు..

Skylab: ఓటీటీలో అలరించనున్న స్కైలాబ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..