Telangana: పండుగ పూట ములుగు జిల్లాలో విషాదం.. గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు!

|

Apr 02, 2022 | 5:17 PM

అప్పటివరకు కళ్లముందు కనిపించిన పిల్లలు నీట మునిగారు. దీంతో గోదావరి తీరం శోకసంద్రంగా మారిపోయింది.

Telangana: పండుగ పూట ములుగు జిల్లాలో విషాదం.. గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు!
Swim Death
Follow us on

Students Drowned in Godavari River: ములుగు జిల్లా(Mulugu District)లో పుణ్యస్నానాలు అచరించేందుకు వచ్చిన విద్యార్థులు నీటి ప్రవాహాంలో కొట్టుకుపోయారు. అప్పటివరకు కళ్లముందు కనిపించిన పిల్లలు నీట మునిగారు. దీంతో గోదావరి తీరం శోకసంద్రంగా మారిపోయింది. ఏటూరునాగారం(Eturunagaram) మండలం రొయ్యురు గ్రామ సమీపంలోని గోదావరి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రొయ్యూరు గ్రామానికి చెందిన దొంగిరి సందీప్, బెడిక సతీశ్‌, ఆకుదారి సాయి వర్ధన్ ఉగాది పండుగ సందర్భంగా గ్రామస్తులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరి నదికి వెళ్లారు.

నీటిలో దిగి స్నానం చేస్తుండ‌గా గోదావరిలో ఒక్కసారిగా ప్రవాహం అధికంగా ఉండడంతో గల్లంతైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కొట్టుకు పోయిన వారంతా విద్యార్థులే. ఇద్దరు ఇంటర్మీడియెట్ చదువుతుండగా, మరో విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసు, రెవిన్యూ సిబ్బంది స్పాట్ చేరుకున్నారు. గ‌ల్లంతైన వారి ఆచూకీకోసం గజఈతగాళ్ల సాయంతో ప్రత్యేక గాలింపుచ‌ర్యలు చేప‌ట్టారు. ముగ్గురు విద్యార్థులు గల్లంతవ్వడంతో ఆ ప్రాంతమంతా విషాదవదనంగా మారిపోయింది.

Read Also….  Viral: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూల్.. ఫీజు ఎంతుంటుందో తెలిస్తే మైండ్ బ్లాంకే!