Hospital Thieves: చివరకు ఆసుపత్రులను కూడా వదలడం లేదు దొంగలు. అక్కడ ఎవో ఖరీదైన వస్తువులు ఎత్తుకెళ్లారంటే ఏమో అనుకోవచ్చు. కానీ వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లారు కక్కుర్తిగాళ్లు. హైదరాబాద్ పాతబస్తీలోని జాంబాగ్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దొంగలు పడ్డారు. ఆసుపత్రిలో కంప్యూటర్లతో పాటు వ్యాక్సిన్ వయల్స్‌ను ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ ఘటన ఆ ఏరియాలో సంచలనం రేకెత్తిస్తోంది
. చివరకు ఆసుపత్రులను కూడా వదలబోమని చేతివాటం ప్రదర్శిస్తున్నారు దొంగలు. జాంబాగ్‌లో పట్టణ ఆరోగ్య ప్రాథమిక కేంద్రం ఉంది. ఎప్పటిలాగానే వైద్యసేవలు అందించిన తర్వాత ఆసుపత్రికి తాళం వేసి వెళ్లిపోయారు సిబ్బంది. సోమవారం ఉదయం వచ్చి చూసే సరికి ఆసుపత్రి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో షాకైన సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా, రెండు కంప్యూటర్ మానిటర్‌లు, సీపీయూలు, కీబోర్డ్స్ తోపాటు, కొవాగ్జిన్ వ్యాక్సిన్ 17 వయల్స్, కొవిషీల్డ్ 27 వయల్స్, ఇతర మందులు మాయమయ్యాయి. అంతే కాకుండా గోడకు బిగించిన టీవీని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నం చేయగా, టీవీ పగిలిపోయింది.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మెడికల్ ఆఫీసర్ లింగమూర్తి. కేసు నమోదు చేసుకున్న మీర్‌చౌక్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Read Also… IT Raids: మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల కలకలం… వందల కోట్ల అక్రమ లావాదేవీల గుర్తింపు?