పేలుతోన్న సెల్‌ఫోన్లు..గాల్లోకి ప్రాణాలు.. బాబోయ్ జాగ్రత్త..

|

Dec 22, 2019 | 8:00 PM

ఇది ఖచ్చితంగా షాకింగ్ న్యూస్. ఫోన్ అనేది ఇప్పుడు ఎంత కామన్ విషయంగా మారిపోయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కానీ దానివల్ల ఎన్ని పాజిటీవ్స్ ఉన్నాయో, అన్ని నెగిటీవ్స్ కూడా ఉన్నాయి. ఎల్లప్పుడూ మన జేబులో ఉండే ఫోన్..ఇప్పుడు ప్రాణ సంకటంగా మారింది. ఫోన్లు పేలడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు మనం రీసెంట్‌గా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్ తెలంగాణలోని కామారెడ్డి జిల్లా వీరాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో పొలంలో పనిచేసుకుంటున్న రైతు […]

పేలుతోన్న సెల్‌ఫోన్లు..గాల్లోకి ప్రాణాలు.. బాబోయ్ జాగ్రత్త..
Follow us on

ఇది ఖచ్చితంగా షాకింగ్ న్యూస్. ఫోన్ అనేది ఇప్పుడు ఎంత కామన్ విషయంగా మారిపోయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కానీ దానివల్ల ఎన్ని పాజిటీవ్స్ ఉన్నాయో, అన్ని నెగిటీవ్స్ కూడా ఉన్నాయి. ఎల్లప్పుడూ మన జేబులో ఉండే ఫోన్..ఇప్పుడు ప్రాణ సంకటంగా మారింది. ఫోన్లు పేలడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు మనం రీసెంట్‌గా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్ తెలంగాణలోని కామారెడ్డి జిల్లా వీరాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

ఎన్నో ఆశలతో పొలంలో పనిచేసుకుంటున్న రైతు ప్రాణాలను ఒక సెల్‌ఫోన్ పొట్టన బెట్టుకుంది. పొలంలో  రైతు సాయిలు ట్రాక్టర్‌తో వ్యవసాయానికి సంబంధించిన పనులు చేస్తున్నాడు. ఇంతలో ఆయన సెల్‌ఫోన్ రింగయ్యింది. ట్రాక్టర్ తోలుతూనే ఫోన్ లిప్ట్ చేశాడు సాయిలు. కొంతసేపు మాట్లాడగానే ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో అయోమయాని గురైన సాయిలు ట్రాక్టర్‌పై నుంచి కింద ఉన్న బురదలో పడిపోయాడు. ట్రాక్టర్ రన్నింగ్‌లో ఉండటంతో, అది ఆయన్ను తొక్కుకుంటూ వెళ్లిపోయింది. దీంతో అతడు పొలంలోనే ప్రాణాలు విడిచాడు. ఫోన్ పేలిన శబ్ధం దూరంగా వేరే పొలంలో ఉన్న రైతులకు వినిపించిందంటే, ఆ పేలుడు తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో అర్దం చేసుకోవచ్చు.

కాగా సాయిలుకి భార్యతో పాటు నలుగురు కూమార్తెలు ఉన్నారు. కుటుంబాన్ని పోషిస్తూ, పెద్ద దిక్కుగా ఉన్న సాయిలు మరణంతో ఆ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో మిగిలిపోయింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.