అశ్లీల వెబ్‌సైట్లపై హైకోర్టు సీరియస్… గూగుల్‌కి నోటీసులు

| Edited By:

Aug 20, 2019 | 4:46 PM

అశ్లీల వెబ్‌సైట్లపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యంది. యువతను పెడదోవ పట్టిస్తున్న ఈ వెబ్‌సైట్లపై గూగుల్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. అశ్లీల వెబ్‌సైట్లపై పూర్తి వివరాలు అందజేయాల్సిందిగా గూగుల్ సంస్థకు నోటీసులు జారీచేసింది. సామాజిక మాధ్యమం అయిన ఫేస్‌బుక్‌ నుంచి వ్యక్తిగత వివరాలు, ఫోటోలను సేకరించి.. వాటిని మార్ఫింగ్ చేసి, అశ్లీల వెబ్‌సైట్లలో పెడుతున్నారంటూ ఓ యువతి హై కోర్టును ఆశ్రయించింది. తన పేరు, ఫోటోలను తొలగించాలని గతంలో గూగుల్ సంస్థకి ఫిర్యాదు చేసినప్పటికీ.. […]

అశ్లీల వెబ్‌సైట్లపై హైకోర్టు సీరియస్... గూగుల్‌కి నోటీసులు
Follow us on

అశ్లీల వెబ్‌సైట్లపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యంది. యువతను పెడదోవ పట్టిస్తున్న ఈ వెబ్‌సైట్లపై గూగుల్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. అశ్లీల వెబ్‌సైట్లపై పూర్తి వివరాలు అందజేయాల్సిందిగా గూగుల్ సంస్థకు నోటీసులు జారీచేసింది. సామాజిక మాధ్యమం అయిన ఫేస్‌బుక్‌ నుంచి వ్యక్తిగత వివరాలు, ఫోటోలను సేకరించి.. వాటిని మార్ఫింగ్ చేసి, అశ్లీల వెబ్‌సైట్లలో పెడుతున్నారంటూ ఓ యువతి హై కోర్టును ఆశ్రయించింది. తన పేరు, ఫోటోలను తొలగించాలని గతంలో గూగుల్ సంస్థకి ఫిర్యాదు చేసినప్పటికీ.. పట్టించుకోకపోవడంతో.. సదరు బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన హై కోర్టు.. పోర్న్ సైట్లను నియంత్రించ కుండా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 1కి వాయిదా పడింది.