Excise Constable Suicide: ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక మరో ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టింది. శంషాద్ అబ్కారి కార్యాలయానికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆశయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీంధ్రరావు వేధింపులు తాళలేక కానిస్టేబుల్ ఆశయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సూపరింటెండెంట్ వేధింపులు ఎక్కువ అయ్యాయని తెలుస్తోంది.
శంషాబాద్ ప్రోబేషన్ ఎక్సైజ్ కార్యాలయంలో ఆశయ్య విధులు నిర్వహిస్తున్నాడు. కార్యాలయంలోనే ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని, తమకు న్యాయం చేయాలని ఆశయ్య కుటుంబసభ్యులు కోరుతున్నారు. వేధింపులు పాల్పడుతున్న సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆశయ్య మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా ఎన్కేతల గ్రామానికి చెందిన ఆర్కతల ఆశయ్య (48) లుంగీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతి చెందిన కానిస్టేబుల్ ఈనెల 4వ తేదీన రాత్రి 10 గంటలకు డ్యూటీకి వచ్చి తెల్లారి 10 గంటలకు డ్యూటీ దిగాల్సివుంది. కానీ, రిలీవర్ కానిస్టేబుల్ గణేష్ ఉదయం వచ్చి చూసేసరికి ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందాడని తెలిపారు. ఆశయ్య 1995 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. పదేళ్ల క్రితమే ఆశయ్యకు గుండె ఆపరేషన్ జరిగిందని, మద్యానికి బానిసయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Also…