Karimnagar Car Accident: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కరీంనగర్ సిటీలోని ప్రఖ్యాత కమాన్ చౌరస్తా సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. రోడ్డుపక్కన గుడిసెలపైకి దూసుకుపోయింది. కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారు చక్రాలకింద నలిగిపోయి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కమాన్ చౌరాస్తా సమీపంలోని రెడ్డి స్టోన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కరీంనగర్ నగరంలో వేగంగా దూసుకువచ్చిన కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన సీస కమ్మరి వృత్తి చేసుకునే వారిపై దూసుకెళ్లింది. ఈ దారుణానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో చనిపోయిన నలుగురూ మహిళలే కావడం విశేషం. గాయపడ్డ మరో తొమ్మిది సమీపంలోని ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని రెస్క్యూ నిర్వహించారు. ఇరుక్కుపోయిన కారును క్రేన్ తో బయటికి లాగి, గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also… Guntur: దొంగతనానికి వచ్చి దర్జాగా బెడ్ పై నిద్రపోయాడు.. తెల్లారగానే ఏం జరిగిందో తెలుసా?