Telangana: పెళ్ళైనా ఎనిమిది నెలలకే ప్రాణాలు తీసుకున్న యువతి.. తప్పెవరిదీ..?

కర్ణాటకలోని నారేడుపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు నవ దంపతులు. వివాహం జరిగే 8 నెలల్లోనే నవిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. నవిత వయస్సు 22 సంవత్సరాలు, భర్త శానప్ప 26 సంవత్సరాలు 8 నెలల క్రితం కర్ణాటకలోని వివాహం చేసుకున్న తర్వాత హైదరాబాద్ అత్తాపూర్ తేజస్వీ నగర్ కాలనీలో అద్దెకు తీసుకొని ఉంటున్నారు. భర్త శానప్ప లేబర్ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు..

Telangana: పెళ్ళైనా ఎనిమిది నెలలకే ప్రాణాలు తీసుకున్న యువతి.. తప్పెవరిదీ..?
Suicide

Edited By: Balaraju Goud

Updated on: Feb 17, 2024 | 2:44 PM

హైదరాబాద్ శివారులో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుని బతుకు దెరువు వెతుక్కుంటూ ఊరు ప్రాంతం వదిలి వచ్చిన ఓ జంట ఆశలు అంతలోనే నీరుగారిపోయాయి. చిన్నపాటి మనస్పర్థలకే ఓ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడింది. రంగారెడ్ది జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేజస్వి నగర్ కాలనీలో 22 సంవత్సరాల వయసు కలిగిన నవిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కర్ణాటకలోని నారేడుపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు నవ దంపతులు. వివాహం జరిగే 8 నెలల్లోనే నవిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది..
నవిత వయస్సు 22 సంవత్సరాలు, భర్త శానప్ప 26 సంవత్సరాలు 8 నెలల క్రితం కర్ణాటకలోని వివాహం చేసుకున్న తర్వాత హైదరాబాద్ అత్తాపూర్ తేజస్వీ నగర్ కాలనీలో అద్దెకు తీసుకొని ఉంటున్నారు. భర్త శానప్ప లేబర్ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు..

గత వారం రోజుల కిందట ఇద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఇద్దరు గొడవపడ్డారు. కుటుంబ కలహాలతోనే వారం రోజులుగా ఎవరితో ఏమీ మాట్లాడకుండా నవిత మౌనంగా ఉంటుంది. అయితే భర్త శానప్ప పని కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లోనే ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అత్తాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే నవిత మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవిత ధైర్యవంతురాలు అని, ఇలా చేసుకోదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపితే నిజా నిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….