కామారెడ్డిలో కలకలం..18 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి

కామారెడ్డి జిల్లాలో 18 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. నాలుగు రోజులుగా తమ కూతురు ఆచూకి  కోసం గాలిస్తోన్న తల్లిదండ్రుల ఆశలు గల్లంతయ్యాయి. దీంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జిల్లాలోని రామారెడ్డి మండలం అన్నారంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో నివాసముండే అఖిల నాలుగు రోజుల క్రితం ఎవ్వరితో చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకి దొరక్కపోవడంతో, పేరేంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆదివారం […]

కామారెడ్డిలో కలకలం..18 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి

Edited By:

Updated on: Dec 22, 2019 | 3:43 PM

కామారెడ్డి జిల్లాలో 18 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. నాలుగు రోజులుగా తమ కూతురు ఆచూకి  కోసం గాలిస్తోన్న తల్లిదండ్రుల ఆశలు గల్లంతయ్యాయి. దీంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జిల్లాలోని రామారెడ్డి మండలం అన్నారంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో నివాసముండే అఖిల నాలుగు రోజుల క్రితం ఎవ్వరితో చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకి దొరక్కపోవడంతో, పేరేంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

అయితే ఆదివారం ఉదయం అన్నారం అవుట్ కట్స్‌లో ఓ గుర్తుతెలియని మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. విచారించగా..ఆ డెడ్‌బాడీ అఖిలదే అని తేలింది. అయితే ఆమె మృతిపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. అఖిల ఆత్మహత్య చేసుకుందా..? లేక ఎవరైనా చంపి పడేశారా అన్న విషయంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే క్లూస్ టీం సాయంతో అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.