నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మడమనూరులో టీడీపీ కార్యకర్త చేవూరు శ్రీనివాసులును దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసులు… రాత్రయ్యే సరికి విగత జీవిగా మారిపోయాడు. ప్రత్యర్థులు ఆయన్ని వెంటాడి, చంపినట్లు తెలుస్తోంది. స్థానికంగా శ్రీనివాసులు… టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటాడు. ఎన్నికల ప్రచారంలో కూడా అతను జోరుగానే పాల్గొన్నాడు. డెడ్ బాడీని చూస్తే… శత్రువులు శ్రీనివాసులును పాశవికంగా నరికి చంపినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యప్తు ప్రారంభించారు.