
పోలీసులంటే ప్రజలను రక్షించేవారు. కానీ ఇక్కడ పోలీసులే రాక్షసులుగా మారారు. కామంతో కళ్లు ముసుకుపోయిన పోలీసులకు వాళ్లు యూనిఫామ్‌లో బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నామన్న విషయం కూడా మర్చిపోయి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరువన్నమలై (అరుణాచలం)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల యువతిపై పోలీసులపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంథాల్ బైపాస్ దగ్గర గత రాత్రి రౌండ్స్ సమయంలో టమాటాలు తీసుకెళ్తున్న గూడ్స్ వాహనాన్ని ఆపి తనిఖీ చేసినా ఇద్దరు కానిస్టేబుల్స్ అనుమానం ఉందని సదరు యువతిని ప్రశ్నించాలంటూ ఆమెను కిందకు దింపారు.
ఆ తర్వాత ఆమెను బలవంతంగా పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్ళి ఇద్దరు కానిస్టేబుళ్లు సుందర్, సురేశ్ రాజ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అటుగా వెళ్తున్న స్థానికులు ఆ యువతి కేకలు విని, ఆమెను ఆ కామాంధుల చెర నుంచి రక్షించి అంబులెన్స్‌లో తిరువన్నమలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ బాధిత యువతిని విచారించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రస్తుతం పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి