Firecracker: విరుధునగర్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఒకరు సజీవదహనం.. పలువురికి తీవ్ర గాయాలు

|

Jul 31, 2021 | 7:08 PM

తమిళనాడు శివకాశి సమీపంలోని విరుధునగర్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి క్షతగాత్రులు చెల్లచెదారుగా పడ్డారు.

Firecracker: విరుధునగర్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఒకరు సజీవదహనం.. పలువురికి తీవ్ర గాయాలు
One Killed In Explosion At Firecracker
Follow us on

Explosion at Tamil Nadu Firecracker unit: తమిళనాడు శివకాశి సమీపంలోని విరుధునగర్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి క్షతగాత్రులు చెల్లచెదారుగా పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా, పేలుడు తీవ్రతకు భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ భవనంలో 30 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. రెండు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలార్పింది.

60 ఏళ్ల బాధితుడు బాణాసంచా తయారీ యూనిట్‌లో రసాయన మిక్సింగ్ గదిలో పని చేస్తున్నప్పుడు భారీ పేలుడు సంభవించింది. గదిలో పనిచేస్తున్న మరో ఇద్దరు తప్పించుకోగలిగారు. పేలుడు కారణంగా మంటలు గది అంతటా వ్యాపించాయి. పేలుడు కారణంగా భవనం పూర్తిగా శిథిలమైంది. పేలుళ్ల దాటికి బాధితుడి శరీరం కాలిపోయి ఛిద్రమైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీన చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నించారు. రెండు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలార్పింది. క్షతగాత్రులను సమీపంలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై విరుదునగర్ జిల్లా కలెక్టర్ జె మేఘనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. బాణాసంచా విభాగానికి అవసరమైన అన్ని లైసెన్సులు ఉన్నాయని చెప్పారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. జూలైలో, విరుదునగర్‌లో తరచుగా జరిగే ప్రమాదాలను అరికట్టే క్రమంలో.. 23 బాణాసంచా తయారీదారుల లైసెన్సులను జిల్లా యంత్రాంగం రద్దు చేసింది. ఈ యూనిట్లలో అక్రమంగా క్రాకర్లు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా పటాకుల తయారీ యూనిట్లు విరుధునగర్‌లోనే ఉన్నాయి. ఈ బాణాసంచా యూనిట్లలో ఉల్లంఘనల కారణంగా ప్రతి సంవత్సరం మంటలు, పేలుళ్ల ధాటికి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Read Also…  

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రద్దు.. ఎప్పటివరకంటే!

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు రద్దు.. ఎప్పటివరకంటే!