Guntur rape case: పోలీసులకు సవాలుగా తాడేపల్లి అత్యాచార ఘటన కేసు.. కీలక నిందితుడి కోసం ముమ్మ‌ర‌ గాలింపు

|

Jun 26, 2021 | 10:59 PM

గుంటూరు జిల్లా సీతానగరంలో గ్యాంగ్ రేప్ కేసు పోలీసులకు సవాల్​గా మారింది. ఘటన జరిగి 8 రోజులవుతున్న తరుణంలో నిందితులను ఇంకా అరెస్టు చేయకపోవడంతో

Guntur rape case:  పోలీసులకు సవాలుగా తాడేపల్లి అత్యాచార ఘటన కేసు.. కీలక నిందితుడి కోసం ముమ్మ‌ర‌ గాలింపు
Father bad behavior
Follow us on

గుంటూరు జిల్లా సీతానగరంలో గ్యాంగ్ రేప్ కేసు పోలీసులకు సవాల్​గా మారింది. ఘటన జరిగి 8 రోజులవుతున్న తరుణంలో నిందితులను ఇంకా అరెస్టు చేయకపోవడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. కొందరి వద్ద కుదవపెట్టిన బాధితుల సెల్​ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో కొంతవరకు నిందితులపై క్లారిటీ వచ్చింది. కీలక నిందితుడు తప్పించుకు తిరుగుతుండగా.. అనుమానితుడి ఫోటోలతో రెండు జిల్లాల్లో పోలీసులు ముమ్మ‌రంగా గాలిస్తున్నారు. రైల్వేకట్టలు, కృష్ణానది కరకట్ట వెంబడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో పనిచేసిన పోలీసు అధికారుల సాయం తీసుకుని విచారణను త్వరగా ముగించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఓవైపు దర్యాప్తు కొనసాగిస్తూనే.. నదిలో రాత్రి సమయాల్లో గస్తీ నిర్వ‌హిస్తున్నారు.

ప్రధాన నిందితులైన ఇద్దరి కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. నిందితుల ఫ్రెండ్స్, బంధువుల ఇళ్లలో కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అసలేం జరిగింది అనే విషయంపై పలుమార్లు బాధితురాలి స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయగా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులను గుర్తించామని హోంమంత్రి సుచరిత తెలుపగా.. వారి ఆచూకీ మాత్రం తేలకుండాపోయింది.

ఇటీవల విహారానికి వెళ్లిన ప్రేమ జంటపై తాడేపల్లి ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద దాడి చేసిన విషయం తెలిసింది. యువకుడి కాళ్లూ చేతులూ కట్టేసి, యువతిపై గ్యాంగ్ రేప్ చేసి పారిపోయారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Also Read:  వీడిన చిక్కుముడి.. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం పీఠాధపతి ఆయ‌నే

మంచిర్యాల జిల్లాలో దారుణం.. పిడుగు పడి 18 మేకలు మృతి..