తెలిసీ తెలియని వయసులో ప్రేమ(Love)లో పడిపోవడం ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణమైపోయింది. చిన్న వయసులో ఆకర్షణకు గురై.. ప్రేమ పేరుతో దగ్గరవుతున్నారు. వారి కోసం తల్లిదండ్రులనూ ఎదురిస్తున్నారు. తాజాగా ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు నిరాకరించారని ఓ యువతి మనస్తాపానికి గురైంది. చనిపోవాలని నిర్ణయించుకుంది. వారధి పై నుంచి కృష్ణా నది(Krishna River)లోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికంగా ఉండే ఒకరు గమనించి ఆ విద్యార్థినిని కాపాడారు. ఈ ఘటన విజయవాడ నగరంలో జరిగింది.
విజయవాడ నగరంలోని ప్రసాదం పాడు ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఓ యువకుడిని ప్రేమించింది. విషయం ఇంట్లో తెలియడంతో అతనినే పెళ్లి చేసుకుంటామని తల్లిదండ్రులకు తెలిపింది. వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని కనకదుర్గ వారధి పై నుంచి కృష్ణానదిలో దూకింది. గమనించిన ఆటో డ్రైవర్ వెంకటేశ్.. వారధి పై నుంచి దూకి విద్యార్థినిని కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు రాబట్టారు. విద్యార్థిని తల్లిదండ్రులను పిలిచించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రాణాలకు తెగించి విద్యార్థినిని కాపాడిన ఆటోడ్రైవర్ వెంకటేశ్ ను స్థానికులు, పోలీసులు ప్రశంసించారు.
Also Read
Jio Plans: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసా..? ప్రయోజనాలు, వాలిడిటీ వివరాలు మీకోసం..
Sivakarthikeyan: తెలుగు మూవీ మొదలుపెట్టిన తమిళ్ హీరో.. శివకార్తికేయన్ సినిమా షూటింగ్ షురూ..
Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. అదిరిపోయే స్టేషన్.. ఫోటోలు షేర్ చేసిన మంత్రి