“సైబర్‌ హర్‌’తో నేరాలకు అడ్డుకట్ట: డీజీపీ మహేందర్ రెడ్డి

ఓ వైపు కరోనా మహమ్మారి పట్టిపీడిస్తుండగా,.మరోవైపు సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. కొత్త కొత్త మార్గాల్లో కేటుగాళ్లు అమాయకులను స్మార్ట్‌గా బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో మరింత అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు...

సైబర్‌ హర్‌తో నేరాలకు అడ్డుకట్ట: డీజీపీ మహేందర్ రెడ్డి

Updated on: Jul 15, 2020 | 8:54 PM

ఓ వైపు కరోనా మహమ్మారి పట్టిపీడిస్తుండగా,.మరోవైపు సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. కొత్త కొత్త మార్గాల్లో కేటుగాళ్లు అమాయకులను స్మార్ట్‌గా బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో మరింత అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహిళలు, పిల్లల కోసం సురక్షితమైన సైబర్ ప్రపంచం లక్ష్యంగా నెల రోజుల పాటు జరిగే ఆన్‌లైన్ ప్రచారం ‘సైబ్ హ‌ర్’ అనే కార్యక్రమాన్ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి బుధవారం ఆన్‌లైన్ వేదికగా ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ…కరోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌లో సైబ‌ర్ నేరాలు బాగా పెరిగాయని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ మహిళా భద్రతా విభాగం నిర్వహిస్తున్న ‘సైబ్ హ‌ర్’ ప్రచారానికి యునిసెఫ్ ఇండియా అవసరమైన సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. ఆన్‌లైన్ ముప్పు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మహిళలు, పిల్లలకు అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సైబర్ నేరాలు జరిగే తీరు, జాగ్రత్తగా ఉండాల్సిన చర్యల గురించి ఇంటర్నెట్ వినియోగదారులకు మరింత అవగాహన కలిగించేలా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.