
Latest Crime News: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. కన్న తల్లి అని కనికరం లేకుండా కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. గంజాయి మత్తులో హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్కంపేటలో నివసించే సంగీతకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడైన 24 ఏళ్ల సంతోష్ కొంత కాలంగా గంజాయికి అలవాటు పడ్డాడు. ఇటీవల ఓ చోరీ కేసులో జైలుకు కూడా వెళ్లాడు. తరచూ ఇంట్లో గొడవలు చేసేవాడు. ఎప్పటిలాగే తల్లితో గొడవ పడిన సంతోశ్ గంజాయి మత్తులో వివేకం మరిచి తల్లిని కత్తితో పొడిచాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సంతోశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
జీడిమెట్లలో దారుణం.. అనుమానం ఆమె పాలిట పెనుభూతమైంది.. కన్నతల్లిని కడతేర్చిన తనయుడు.