Crime News: కొన్ని నెలలుగా ఇంటికి తాళం.. తెరిచి చూడగానే షాకైన కుటుంబం.. అసలేం జరిగిందంటే..?

Skeleton found in house: వారి ఇంటికి తాళం వేసి చాలా రోజులైంది. అయితే వారు ఇంటిని శుభ్రం చేద్దామని అనుకున్నారు. తీరా తాళం తీసి ఇంటి లోపల

Crime News: కొన్ని నెలలుగా ఇంటికి తాళం.. తెరిచి చూడగానే షాకైన కుటుంబం.. అసలేం జరిగిందంటే..?
Old House

Updated on: Aug 07, 2021 | 11:07 AM

Skeleton found in house: వారి ఇంటికి తాళం వేసి చాలా రోజులైంది. అయితే వారు ఇంటిని శుభ్రం చేద్దామని అనుకున్నారు. తీరా తాళం తీసి ఇంటి లోపల చూడగా.. అస్థిపంజరం బయటపడింది. దీంతో ఆ కుటుంబంలో భయాందోళన మొదలైంది. తీరా ఆ అస్థిపంజరం ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిదేనంటూ పోలీసులు నిర్థారించడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై అమింజికరై రైల్వే కాలనీలో చోటుచేసుకుంది. అమింజికరైలోని రైల్వే కాలనీ 3వ వీధికి చెందిన మహేష్‌ (45)కు అదే ప్రాంతంలో సొంత ఇల్లు ఉంది. అది శిథిలావస్థకు చేరడంతో చాలాకాలం నుంచి తాళం వేసి ఉంచారు. ఈ క్రమంలో శుక్రవారం ఇంటిని శుభ్రం చేయడానికి తాళం తీశారు. ఈ క్రమంలో ఆ ఇంటి వరండాలో అస్థిపంజరం కనిపించడంతో.. అందరూ ఉలిక్కిపడ్డారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. లభ్యమైన అస్థిపంజరం.. మహేష్‌ అన్న రమేష్‌ (49) ది అని పోలీసులు నిర్థారించారు. మహేష్ అన్న.. రమేష్‌ కారు డ్రైవర్‌. అతనికి పెళ్లి కాకపోవడంతో ఆ ఇంటిలో ఒంటరిగా ఉంటూ చనిపోయినట్లు గుర్తించారు. అయితే.. రమేష్ రెండేళ్ల నుంచి కనిపించకుండా పోయాడని.. అతని జాడ గురించి ఎవరికీ తెలియదని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ అస్థిపంజరాన్ని పరీక్ష కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. డీఎన్ఏ రిపోర్టు అనంతరం ఇది ఎవరి అస్థిపంజరమో తేలుతుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Crime: పెళ్లి కాకుండానే ప్రసవం.. ఆపై బిడ్డను కిటికీలోంచి విసిరేసి.. చివరకు ఏం జరిగిందంటే..?

Hyderabad: నడిరోడ్డుపై మలవిసర్జన.. ప్రశ్నించిన పాపానికి తిట్ల దండకం.. సెల్‌ఫోన్ లాక్కొని హోంగార్డుపై దాడికి యత్నం!

Loading...
Unable to load recommendations.
Follow Us