హైదరాబాద్ కృష్ణానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. సాయికృప స్కూల్‌లో పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం జరిగిన దాడుల్లో మన్సూర్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సాయికృప స్కూల్ లో ఆరుగురు విద్యార్థులు కాస్ల్‌రూమ్‌లోనే గొడవపడ్డారు. గతంలో క్రికెట్ ఆటలో జరిగిన ఘర్షణను తెరపైకి తెచ్చి.. మరోసారి తరగతి గదిలో గొడవ పడ్డారు. వాటర్ బాటిల్స్‌తో కొట్టుకున్నారు. ఈ ఘటనలోనే తీవ్రంగా గాయపడ్డ మన్సూర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి మృతి విషయాన్ని వెంటనే స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గదిలోని ఆధారాలను సేకరించారు. ఆ గదిలోని సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు.
మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్కూల్ కరస్పాండెంట్ చెప్పారు. స్కూల్లో గొడవ జరగలేదని, వాటర్ బాటిల్స్‌తో ఎవ్వరూ కొట్టుకోలేదని ఆయన అన్నారు. ఈ ఘటనపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్ధులు ఘర్షణ పడుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లల మధ్య గొడవలు జరుగుతుంటే యాజమాన్యం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
రేపటితో ముగియనున్న గడువు.. ఆ జిల్లా నుంచే అధిక వినతులు.. హామీ ప్రకారమే పునర్ వ్యవస్థీకరణ
Viral Video: లైకులు వస్తాయనుకున్నాడు.. షర్ట్ పైకి ఎగరేశాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!