మరణించిన వ్యక్తి పాడెక్కగానే లేచాడు..చచ్చి, బతికి… మళ్లీ చచ్చాడు..

|

Oct 05, 2020 | 6:02 PM

ఏ జీవికైనా ప్రాణం ఒకేసారి పోతుంది. ఒకసారి మరణించిన ప్రాణి తిరిగి బతికిరావటం అన్నది అసాధ్యం. కానీ, ఇక్కడ మాత్రం విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.

మరణించిన వ్యక్తి పాడెక్కగానే లేచాడు..చచ్చి, బతికి... మళ్లీ చచ్చాడు..
Follow us on

ఏ జీవికైనా ప్రాణం ఒకేసారి పోతుంది. ఒకసారి మరణించిన ప్రాణి తిరిగి బతికిరావటం అన్నది అసాధ్యం. కానీ, ఇక్కడ మాత్రం విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చనిపోయాడని అంతా అనుకున్నారు. కుటుంబమంతా తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది. దహన సంస్కారాలకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అంత్యక్రియల కోసం పాడె మీదకు తీసుకెళ్లగానే హఠాత్తుగా కళ్లు తెరిచి చూశాడా వ్యక్తి. చచ్చిపోయాడనుకున్న వ్యక్తి… మళ్లీ బతికి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, అంతలోనే ఊహించని విధంగా మళ్లీ ప్రాణాలు విడిచాడు ఆ వ్యక్తి. ఈ విచిత్ర సంఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మెదక్ జిల్లా చేగుంటలో వింత సంఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన 45 సంవత్సరాల చంద్రమోహన్ అనే వ్యక్తి ఇంటివద్దే ఉంటున్నాడు. నిత్యం మద్యం సేవించి భార్యను వేధించడంతో ముగ్గురు పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్ళింది. తీవ్ర అనారోగ్యంతో చంద్రమోహన్ మృతిచెందాడు. భర్త చనిపోయిన విషయాన్ని భార్యకు సమాచారం అందించారు బంధువులు. పిల్లలను తీసుకొని చేగుంటకు చేరుకుంది. బంధువులందరూ చంద్రమోహన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. స్మశానానికి తరలించడం కోసం పాడే కట్టి డప్పు వాయిద్యాలు మోగించడం, చంద్రమోహన్ కు వేడినీళ్లతో స్నానం చేస్తున్న క్రమంలో చంద్రమోహన్ నాడీ గుండె కొట్టుకోవడం ప్రారంభించింది.

చనిపోయాడని భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా కళ్ళు తెరిచి చూశాడు చంద్రమోహన్‌. దీంతో అతన్ని అంబులెన్స్ వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మళ్లీ మృతి చెందాడు. తిరిగి అంత్యక్రియలు నిర్వహించారు. చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్లీ బతికిరావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.