Shocking incident in Nellore: నెల్లూరు జిల్లాలో హైవే పక్కన ఓ కారు దగ్ధమైంది. మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఇది ప్రమాదమా లేక హత్యా? ప్రమాదంపై రేకెత్తుతున్న అనుమానాలు. ఎవరా వ్యక్తి? అసలేం జరిగింది? నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగముడి సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. కారులో మంటలు చెలరేగి మల్లిఖార్జున్ అనే వ్యక్తి సజీవదహనం కావడం స్థానికంగా సంచలనంగా మారింది. మృతుడు నెల్లూరులో ఆర్కే జిరాక్స్ సెంటర్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పారు. అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదంపై పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మల్లిఖార్జున్‌ను ఎవరైనా హత్య చేసి ఉంటారా లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కారు దగ్ధం ఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కారులో సజీవదహనమైన మల్లికార్జున్‌కు కుటుంబసభ్యులతో విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కారు నంబరు ఆధారంగా సేకరించిన వివరాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు.
అయితే.. మృతుడు మల్లికార్జునే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మల్లికార్జున్ కుటుంబసభ్యులతో ఎలా ఉండేవాడు? వారితో ఉన్న విభేదాలేంటి అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడు మల్లికార్జునే కారుకు నిప్పంటించుకుని ఉంటాడన్న కోణంలోనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు పోలీసులు. త్వరలోనే ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వివరాలను వెల్లడిస్తామని వెంకటాచలం పోలీసులు తెలిపారు.
Also Read: