రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఆ చిన్నారిని ఎట్టకేలకు తల్లి ఒడికి చేర్చారు పోలీసులు. చటాన్‌పల్లికి చెందిన స్నేహితను గుర్తు తెలియని వ్యక్తి… బైక్‌పై ఎక్కించుకుని ఎత్తుకెళ్లాడు. పాప కనిపించకపోవడంతో పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా వెదికి పాపను పట్టుకున్నారు. అన్నతో వీధిలో అడుకుంటున్న స్నేహితను బైక్ పై వచ్చిన వ్యక్తి బిస్కెట్ ఇప్పిస్తానంటూ.. వెనుక కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాడు ఓ దుండగుడు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో పాప కిడ్నాప్ దృశ్యాలు రికార్డు అయ్యాయి. కిడ్నాపర్ పాపను జడ్చర్ల వైపు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. విజువల్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు పాపను పట్టుకున్నారు.
పాప తల్లిదండ్రులది జడ్చర్ల. తండ్రి మేస్త్రి పని చేస్తుంటాడు. కిడ్నాపర్ కూడా మేస్త్రి పని చేసే జడ్చర్లకు చెందిన వ్యక్తి. తనకు పిల్లలు లేరని.. పాపను ఎత్తుకెళ్లేందుకు కిడ్నాపర్ ప్రయత్నించాడని చెప్తున్నారు పోలీసులు. అయితే అసలేం జరిగిందనే దానిపై ఆరా తీస్తామని చెప్తున్నారు.