”తనతో ఓ రాత్రి గడిపితేనే.. ఉద్యోగం ఉంటుందంట” మహిళా ఉద్యోగులకు సంస్థ అధికారి లైంగిక వేధింపులు..

|

Feb 06, 2021 | 9:07 PM

Crime News Hyderabad: ఓ సంస్థలో ఉన్నత స్థాయిలో పని చేస్తున్న ప్రభుద్దుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతగాడి వెకిలి చేష్టలు భరించలేక..

తనతో ఓ రాత్రి గడిపితేనే.. ఉద్యోగం ఉంటుందంట మహిళా ఉద్యోగులకు సంస్థ అధికారి లైంగిక వేధింపులు..
Follow us on

Crime News Hyderabad: ఓ సంస్థలో ఉన్నత స్థాయిలో పని చేస్తున్న ప్రభుద్దుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతగాడి వెకిలి చేష్టలు భరించలేక ఆ సంస్థలో పని చేస్తోన్న మహిళా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అతడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. ఆ వివరాలు ఏంటంటే..

శంషాబాద్ విమానాశ్రయంలోని ఎజైల్ ఎయిర్‌పోర్టు సర్వీసెస్‌లో పని చేస్తోన్న మహిళా ఉద్యోగులు సంస్థ నిర్వాహకుడైన శ్రీకాంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను గత కొంతకాలంగా లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. తనతో ఓ రాత్రి గడిపితేనే.. ఉద్యోగాలు ఉంటాయంటూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరేళ్లుగా ఇండిగోలోని ఎజైల్‌లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి పోలీసుల ముందు తన గోడు వేల్లబోసుకుంది.. తన దగ్గర నుంచి శ్రీకాంత్ రూ. 15 వేలు తీసుకున్నాడని.. డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. ”తనతో ఓ రాత్రి గడిపితేనే.. ఉద్యోగం ఉంటుందంటూ” టార్చర్ చేస్తున్నాడని ఆ మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read: అల్లు అర్జున్ కార్వాన్‏ను ఢీకొట్టిన లారీ.. ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం..