కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురిని బలి తీసుకుంది. కారు అదుపుతప్పి రోడ్డు వెంట నిలిపిన ట్రక్కును ఢీకొట్టింది. కలబురిగి జిల్లా సవలగి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజూమున జరిగిన ఈ దుర్ఘనలో గర్భిణీతో సహా ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులంతా అలండ్ పట్టణానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. గర్భిణీని ప్రసవం కోసం కలబురిగికి తీసుకువస్తుండగా ఆగిన ఉన్న లారీని వేగంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతులను ఇర్ఫానా బేగం (25), రూబియా బేగం (50), అబేదాబీ బేగం (50), జయ చున్‌బీ (60), మునీర్ (28), మహ్మద్ అలీ (38), షౌకత్ అలీ (29) గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
7 people, including pregnant woman killed in road accident in Karnataka
read more @ https://t.co/c2nER7HdEJ pic.twitter.com/xZyIPxc0E5— The South Indian Post (@southindia_post) September 27, 2020